వెలుగులోకి వచ్చిన దర్శకేంద్రుడి కుటుంబ వ్యవహారం

  • August 2, 2019 / 06:54 PM IST

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు.. పరిచయం అవసరం లేని పేరు. అప్పట్లో ఈయన ఎన్నో ఇండస్ట్రీ హిట్లు.. బ్లాక్ బస్టర్లు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇప్పటికీ బాగా ఎంజాయ్ చేసే సినిమాలు ఆయన మనకి అందించారు. ఎంతోమందిని స్టార్లను చేసిన చరిత్ర ఆయనది. అంతేకాదు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఇదిలా ఉండగా… ఈయన కుటుంబానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకి వచ్చి పెద్ద రచ్చ చేస్తుంది.

విషయం ఏమిటంటే.. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్ లు రెండేళ్ల క్రితమే విడిపోయారట. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా వీరిద్దరూ కలసి పని చేశారు. అయితే మేము విడిపోయాం అని స్వయంగా కనికనే వెల్లడించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి వీరిద్దరూ కలసి పని చేశారు. ప్రకాశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి కనిక రచయిత్రిగా పనిచేసింది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది కనిక. “ప్రకాష్, నేను రెండేళ్ళ క్రితమే విడిపోయాం. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఏకాభిప్రాయంతో విడిపోయాం. అయినప్పటికీ స్నేహితుల్లా కలిసున్నాం” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus