కథానాయకుడైనా.. ప్రణీతకు గుర్తింపు తెచ్చిపెడతాడా..?

  • January 7, 2019 / 07:24 AM IST

‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ ‘బావ’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘డైనమైట్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ …… హీరోయిన్ గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ప్రణీత. అయినా ప్రణీత చేయని ప్రయత్నమంటూ లేదు. తెలుగుతో పాటు.. తమిళ , కన్నడ భాషల్లో చిత్రాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కట్లేదనే చెప్పాలి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. చూడటానికి నిజంగానే బాబు బొమ్మలా.. మంచి అందం, నటన కలిగి ఉన్నప్పటికీ ఎందుకో ఈ అమ్మడికి కాలం కలిసిరావట్లేదు. పోనీ సెకండ్ హీరోయిన్ గా అయినా కలిసొస్తుందని చేసిన ప్రయత్నాలు కూడా నిలబెట్టలేకపోయాయి. జూ.ఎన్టీఆర్ తో చేసిన ‘రభస’, మహేష్ బాబు తో చేసిన ‘బ్రహ్మోత్సవం’, రామ్ తో చేసిన ‘హలో గురు ప్రేమ కోసమే’చిత్రాలు కూడా పెద్దగా ఉపయోగ పడలేదు.

ఇక ఈ నేపథ్యంలో ప్రణీత తన ఆశలన్నీ ‘ఎన్టీఆర్ బయోపిక్’ పైనే పెట్టకుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రణీత.. కృష్ణకుమారి పాత్రలో కనిపించనుందట. పాత్ర ఉండేది కొద్దిసేపే అయినప్పటికీ మంచి నటన కనపరిచిందట. ప్రణీత నటనను క్రిష్ ప్రత్యేకంగా అభినందించారంట. ఈ చిత్రంలో ప్రణీత నటనకు కచ్చితంగా మంచి మార్కులు పడతాయని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ చిత్రంతో అయినా.. ప్రణీతకు హీరోయిన్ గా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus