మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రవీణ్ సత్తార్!

  • December 7, 2017 / 01:26 PM IST

చిన్న చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ ప్రవీణ్ సత్తార్ కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. అతను డైరక్ట్ చేసిన లవ్ బీఫోర్ వెడ్డింగ్ (ఎల్‌బీడబ్య్లూ), రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు.. సినిమా కథలు ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా సినిమాలు తీస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డైరక్టర్ గుంటూరు టాకీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఆర్ధికంగానూ మంచి లాభాలను పంచి పెట్టింది. దీని తర్వాత  సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ తో భారీ సినిమాని మలిచారు. క్రేజ్ తగ్గిపోయిన హీరోతో సినిమా అంటే ఎవరైనా వెనుకడుగువేస్తారు.

అయినా ఆ సాహసం చేసి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. దీంతో అవకాశాలు వరుసగా వచ్చాయి. వచ్చిన వాటిని పక్కన పెట్టి తన దారిలోనే నడవాలని ఫిక్స్ అయ్యారు. యువ హీరోలు నితిన్, రానా, నారా రోహిత్ తో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు దారులు వేరు. వారు చేసే సినిమాలు వేరు. అటువంటి వారిని ఒకే ప్రేమ్ లో బంధించుకోవాలనుకోవడం సాహసమే. ఈ ప్రయత్నంలో ప్రవీణ్ సత్తార్  విజయాన్ని అందుకుంటారో? లేదో .. కాలమే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus