సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియదర్శి, రిచాల పెళ్లి ఆహ్వాన పత్రిక

  • February 20, 2018 / 09:25 AM IST

పెళ్లి చూపులు సినిమాలో అచ్చమైన తెలంగాణ స్లాంగ్ తో ప్రియదర్శి అదరగొట్టారు. ‘నా చావు నేను చస్తా నీకెందుకు’ అంటూ నవ్వులు పూయించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలోనూ ఆకట్టుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి లో లాయర్ గా, ఎంసీఏ లో స్నేహితుడిగా తనదైన శైలిలో మెప్పించారు. తాజాగా వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమాలోను మెప్పించారు. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి ప్రేమికుల రోజు నాడు తన మనసు గెలుచుకున్న అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. తాను రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రియదర్శి, రిచా శర్మలు ఈనెల 23న ఆగ్రాలోని గ్రాండ్ హోటల్ లో పెళ్లి చేసుబోతున్నట్లు తెలిసింది. ఈ పెళ్ళికి ప్రియదర్శి, రిచా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక మిత్రుల కోసం రిసెప్షన్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26 న నరేన్ గార్డెన్స్ లో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు బంధు, మిత్రులతో పాటు సినిమా ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus