ఈ ఏడాది హిట్ జాబితాలో చేరిన చిత్రం పెళ్లి చూపులు. ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవర కొండ, రీతూలకు ఎంత పేరు వచ్చిందో.. కౌశిక్ పాత్రలో తెగ నవ్వించిన ప్రియదర్శికి అంతే పేరు వచ్చింది. పరిశ్రమకు మరో కమెడియన్ పరిచయం అయ్యాడని సినీ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇదివరకు హీరో శ్రీకాంత్ సినిమా టెర్రర్ లో నటించిన ఈ తెలంగాణా కుర్రోడు గతంలో 15 కు పైగా షార్ట్ ఫిలిం లో తన ప్రతిభను ప్రదర్శించాడు. పెళ్లి చూపులు మూవీ తో గుర్తింపు పొందాడు. ఆగస్టు 12 న రిలీజ్ కానున్న బొమ్మల రామారం సినిమాలో విలన్ గా నటించాడు.
ఈ సందర్బంగా ప్రియదర్శి మాట్లాడుతూ “పెళ్లి చూపులు నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇలా కామెడీ పాత్రలతో పాటు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను. అది కామెడీనా, సీరియస్సా అని ఆలోచించను. మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచుకోవాలన్నది నా ఆశ” అని చెప్పాడు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు అని దర్శి ని అడిగితే, అందుకు అతను “త్రివిక్రమ్ సార్ గొప్ప దర్శకుడు.. ఆయన నుంచి పిలుపు వస్తే ఎగిరి గంతేస్తాను. ఏ పాత్ర ఇచ్చినా సంతోషంగా ఒప్పుకుంటాను” అని మనసులోని మాటను బయట పెట్టారు.