అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రియమణి ‘విస్మయ’

Advertisement

సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్‌ కూడా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం “నన్న ప్రకార” అక్కడ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను “విస్మయ” అంటూ ఇప్పుడు తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

“విస్మయ” సినిమాలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్‌ కిషోర్‌ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. దర్శకుడు వినయ్‌ బాలాజీకి ఇది మొదటి చిత్రం. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ తరువాత వీఎఫ్ఎక్స్ ప్రొవైడర్‌గా పని చేసిన అనుభవాన్ని ఈ సినిమాలో చూపించారు. విస్మయ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ప్రియమణి నటించిన ఈ “విస్మయ” చిత్రం ఇప్పుడు అమెజాన్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్‌గా పని చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus