టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత రాజ్ అల్లాడకి(Raj Allada) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ‘నిలవే’ అనే చిన్న సినిమాతో నిర్మాతగా మారిన ఈయన ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆయన నాట్స్ (నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ) సంస్థకి ప్రెసిడెంట్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.

Raj Allada

ఇదిలా ఉండగా.. చైర్మన్ కిషోర్ కంచర్ల, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగులతో కలిసి సెప్టెంబర్ 20న నిడదవోలులోని ‘హృదయాలయం’ ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించడం జరిగింది.’సంబరంలో సేవ’ కార్యక్రమంలో భాగంగా నాట్స్ సంస్థ రూ.80 లక్షల విరాళాన్ని అందించింది.

ఈ మొత్తాన్ని పలు సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించినట్లు నాట్స్ సంస్థ ప్రెసిడెంట్, నిర్మాత అయినటువంటి రాజ్ అల్లాడ వెల్లడించారు. కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ ప్రత్యేక మనసిక వికలాంగులైన చిన్నారులతో మమేకమై, వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సు, ఫిజియోథెరపీ సేవలను పరిశీలించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి, పాఠశాల, పునరావాస కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు.

మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను హోప్4 స్పందన ఆంధ్ర–తెలంగాణ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు. నిడదవోలు,రాజమండ్రిలో జరిగిన సామాజిక సేవల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డా గణేష్ బాబు గారు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మీ గారు, దయ్యాల మహేష్ గారు పాల్గొన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో సమాజ సంక్షేమానికి తమ సేవలను మరింత విస్తరించేందుకు నాట్స్ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.

2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus