Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Advertisement

‘ది రాజాసాబ్’ సినిమా ప్రభాస్ అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. కంటెంట్ పై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.

Fauzi

ప్రభాస్ వంటి పాన్ ఇండియా సినిమా స్టార్ ను పెట్టుకుని.. క్వాలిటీ లేని వీ.ఎఫ్.ఎక్స్ తో అతని స్థాయిని బాగా తగ్గించారు అంటూ.. అంతా పెదవి విరిచారు. సరే ఆ సినిమా ఫలితాన్ని వీలైనంత త్వరగా మరిపించేందుకు ప్రభాస్ సైతం ప్రయత్నిస్తున్నాడు.

ఇందులో భాగంగా అతను.. స్పీడ్ పెంచి ‘స్పిరిట్’ ‘ఫౌజి'(Fauzi) వంటి సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ‘కల్కి 2’ షూటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఎటొచ్చీ ఏ సినిమా ముందోస్తుంది అనే కన్ఫ్యూజన్ కూడా కొంత నెలకొంది. దీనికి ‘మైత్రి మూవీ మేకర్స్’ సీఈఓ అయినటువంటి చెర్రీ క్లారిటీ ఇచ్చారు. అవును అతని ‘జెట్లీ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

ఓ ఇంటర్వ్యూలో ఆయనకి ‘ఫౌజీ’ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ” ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ అల్మోస్ట్ 80 శాతం పూర్త‌య్యింది. 2026 ఎండింగ్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మిగిలిన 20 శాతం షూటింగ్ వేగంగా పూర్తిచేయడం పెద్ద కష్టమేమీ కాదు.వార్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ స్థాయిలో ఉంటాయని ఎవ్వరూ అంచనా కూడా వేయలేరు” అంటూ చెప్పుకొచ్చారు చెర్రీ. ఆయన మాటలను బట్టి ఈ ఏడాదే ‘ఫౌజీ’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus