ఎఫ్ 2 సక్సెస్ కి సూపర్ గిఫ్ట్ ప్లాన్ చేసిన దిల్ రాజు

  • February 5, 2019 / 01:31 PM IST

ఇదివరకూ సినిమాలు తీసినందుకు దర్శకులకు కేవలం రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. కానీ ఈమధ్యకాలంలో నిర్మాతలు తమకు హిట్ ఇచ్చిన దర్శకులకు భారీ గిఫ్త్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఈ పద్ధతిని యువీ క్రియేషన్స్ సంస్థ మొదలెట్టగా అనంతరం మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఈ పద్ధతిని దిల్ రాజు కూడా అవలంబించుకున్నాడు. రీసెంట్ గా తన టీం మెంబర్స్ అందరినీ సరదాగా బ్యాంకాక్ తీసుకెళ్లిన దిల్ రాజు.. ఆ సక్సెస్ కు అసలు కారకుడైన అనిల్ రావిపూడికి మంచి భారీ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

అయితే.. ఏం గిఫ్ట్ కావాలనే ఆప్షన్ కూడా అనిల్ కే ఇచ్చాడట దిల్ రాజు. కాస్ట్లీ కార్ కావాలా లేక బంగ్లా కావాలా అని అడిగాడట. అనిల్ రావిపూడి ఏది సెలక్ట్ చేసుకుంటే అది కొనివ్వడానికి రెడీగా ఉన్నాడు దిల్ రాజు. మరి అనిల్ ఏం సెలక్ట్ చేసుకుంటాడో చూడాలి. ఇకపోతే.. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కించనున్నాడని టాక్ నడుస్తుండగా.. అది మహిళా ప్రాధాన్య చిత్రం అని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus