ఆ టైటిల్ రష్మిక కొంప ముంచింది?

  • August 21, 2019 / 07:28 AM IST

‘ఛలో’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని దూసుకుపోతుంది. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ అంటే రష్మికనే అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఓ సమస్యలో చిక్కుకుంది. విషయం ఏమిటంటే… ‘తమ అనుమతి లేకుండా సినిమా టైటిల్ ను ముందుగానే సోషల్ మీడియాలో పెట్టినందుకు రష్మిక పై నిర్మాతలు ఫైర్ అయ్యారట.

విషయం ఏమిటంటే… రష్మిక ప్రస్తుతం కార్తికి జోడీగా తమిళంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేయాలనుకున్నారట. కానీ రష్మిక మాత్రం ముందుగానే తన సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ‘సుల్తాన్‌’ అనే టైటిల్ ను చెప్పేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ‘షూటింగ్లో నాలుగోరోజు’… అంటూ ఓ ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో దర్శకనిర్మాతల ఆశల పై నీళ్ళు జల్లినట్టయ్యింది. ఈ విషయంలో వారు రష్మిక పై మండిపడినట్టు కూడా సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus