‘మెహబూబా’కి అద్భుత విజయాన్ని అందించి ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు – పూరి జగన్నాథ్‌

ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘మెహబూబా’ విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌ టాక్‌తో, సూపర్‌ కలెక్షన్స్‌తో సూపర్‌హిట్‌ దిశగా పయనిస్తోంది. ఈ సందర్భంగా దర్శకులు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ”నిన్న రిలీజ్‌ అయిన ‘మెహబూబా’ చిత్రానికి అన్ని సెంటర్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కలెక్షన్లు చాలా చాలా బాగున్నాయి. ఆకాష్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. ఒక కొత్త హీరోకి ఇంతటి భారీ ఓపెనింగ్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది.

ఆకాష్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి, అతను చెప్పిన డైలాగ్స్‌ గురించి అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌… ఇలా టెక్నికల్‌గా కూడా మంచి అప్రిషియేషన్‌ రావడంతో మా యూనిట్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ‘మెహబూబా’ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తూ, ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఈ విజయం దర్శకుడుగా నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ సక్సెస్‌కి కారకులైన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడుగా నా కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాను. ‘మెహబూబా’ సాధించిన ఘనవిజయం భవిష్యత్తులో మరిన్ని పెద్ద హిట్‌ సినిమాలు తియ్యడానికి స్ఫూర్తినిచ్చింది” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus