ఆ సినిమాకు పూరి తన ప్రేమ కథనే వాడేశాడా..?

  • April 10, 2020 / 12:01 PM IST

సినిమాకు మించిన నాటకీయత నిజ జీవితాలలో చోటు చేసుకుంటుంది. సినిమాకి కథావస్తువు అనేది మన చుట్టు ఉన్న సంఘటనల నుండే పుడుతుంది. మన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రేమ కథలో సినిమాకు మించిన నాటకీయత ఉంది. ప్రేమ కథలను తన కోణంలో కొత్తగా ఆవిష్కరించే పూరి జగన్నాధ్ ప్రేమ కథను ఒకేసారి చూస్తే, ఆయన చేసిన సినిమాలలో కొన్నిటికి ఆయన ప్రేమ కథే ప్రేరణ అనిపిస్తుంది. పూరి జగన్నాద్ తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారం అంటే అంత ఈజీగా ఏమీ జరిగిపోలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది.

దర్శకుడిగా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పూరి దూరదర్శన్ లో ఓ సీరియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులలో షూటింగ్ కొరకు హైదరాబాద్ లోని రామంతపూర్ వెళ్లారట. అక్కడ లావణ్యను చూసిన పూరి మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోయాడట. తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాలో తెలియని పూరి అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిసి, ‘ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఇది నా విజిటింగ్ కార్డు ఇందులో ఫోన్ నంబర్ కూడా ఉంది..నచ్చితే కాల్ చేయమని చెప్పు..’ అని కార్డు ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్ళిపోయాడట. చూసిన వెంటనే ప్రేమంటే ఎవరు నమ్ముతారూ..లావణ్య కూడా అదే చేసిందట.

ఐతే పట్టువదలని పూరి ఆమె ప్రేమను దక్కించుకున్నాడట. మరి ప్రేమైతే గెలుచుకున్నాడు. పెళ్లి సంగతో అంటే…అప్పుడే అసలు సమస్య మొదలైందట.ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి ససేమిరా అన్నారట. దానితో వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా స్నేహితుల సమక్షంలో 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆకాష్, పవిత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ప్రేమ కథ వింటే ఇడియట్ సినిమాకు ప్రేరణ అనిపిస్తుంది కదూ.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus