R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

మహేష్ బాబు కెరీర్లో ‘నిజం’ ఓ స్పెషల్ మూవీ. వాస్తవానికి అది హిట్టు సినిమా కాదు. కానీ ఆ సినిమాలో మహేష్ బాబు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా బాగానే ఉన్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందుకు కారణం ‘ఒక్కడు’ తర్వాత రిలీజ్ అవ్వడం వల్లనే అని దర్శకుడు తేజ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా అతని ఆస్థాన సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్(R. P. Patnaik) సైతం అదే మాట చెప్పారు.

R. P. Patnaik

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ” ‘నిజం’ విషయంలో జరిగింది వేరు. ‘నిజం’ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ‘ఒక్కడు’ కనుక రిలీజ్ కాకుండా ఉంటే.. ‘నిజం’ సినిమా ఆడేది. ‘ఒక్కడు’ తర్వాత రిలీజ్ అవ్వడం వల్ల ‘నిజం’ అనేది చిన్న సినిమా అయిపోయింది. ‘ఒక్కడు’ సినిమాలో హీరోయిజం ఓ రేంజ్లో ఎలివేట్ అయ్యింది. అయితే తర్వాత వచ్చిన ‘నిజం’ సినిమాలో ‘తల్లి చాటు బిడ్డగా’ మహేష్ బాబుని ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు.

‘ఒక్కడు’ తర్వాత రావడం వల్లే ‘నిజం’ కి ప్రోబ్లెమ్ అయ్యింది.ఒకవేళ ‘ఒక్కడు’ కంటే ముందు కనుక ‘నిజం’ వచ్చి ఉంటే దాని మార్కెట్ దానికి ఉండేది. అదే నా ఫీలింగ్. పాటల విషయంలో నా వాయిస్ మహేష్ బాబుకి సెట్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అదే అనుకున్నారు. కృష్ణ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. పాటలకి వేరే సింగర్ ఉంటే బాగుణ్ణు అని ఆయన అన్నారు. నాకు కూడా అది అనిపించింది. శంకర్ మహదేవన్,కెకె వంటి వాళ్ళు తెలుగుని తెలుగులా పడతారు.

అలా పాడని వాళ్ళు నాకు వద్దు అనుకుంటాను. దురదృష్టవశాత్తు ఆ టైమ్లో శంకర్ మహదేవన్,కెకె..లు అందుబాటులో లేరు. అందువల్ల నేనే పాడేశాను. సినిమాలో అన్ని పాటలు నేను పాడేయడం వల్ల.. మహేష్ బాబుకి నా వాయిస్ సూట్ అవ్వకపోవడం వల్ల కూడా పాటలు జనాల్లోకి అనుకున్న స్థాయిలో వెళ్లలేదు.

3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus