ఆర్పీ పట్నాయక్, ఒకప్పుడు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ప్రస్తుతానికి పార్ట్ టైమ్ దర్శకుడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ దర్శకుడు మంచి టాలెంట్ ఉన్న వాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి ఫాం లో ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోకుండా తాను మ్యూజిక్ చెయ్యను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పటివరకూ చాలా మందికి తెలీదు. అయితే దానికి కారణం నాగార్జున అని అప్పట్లో గాసీప్స్ వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ.
అసలు ఏం జరిగింది అంటే, ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ అనేక విషయాలపై మాట్లాడుతూ, నాగార్జున హీరోగా నటించిన నేనున్నాను సినిమాకు మొదట తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారని అయితే ఆ తర్వాత కొన్ని ట్యూన్స్ కూడా తాను ఇచ్చిన తరువాత ఒక ప్రముఖ వ్యక్తి తన దగ్గరకు వచ్చి తనను ఆసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవటం నిర్మాతలకు ఇష్టం లేదు అని చెప్పాడట. దీనికి కారణం తన పేరు సంగీత దర్శకుడుగా ఉంటే ఆసినిమాకు బిజినెస్ జరగదు అని చెప్పడంతో ఇక అప్పటి నుండి తాను సినిమాలకు సంగీత దర్శకత్వం వహించకూడదు అన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆర్పీ అలనాటి విషయాలను బయట పెట్టాడు. అయితే అనుకోకుండా అందరూ నాగార్జున వల్ల తనకు ఆ ఛాన్స్ పోయింది అంటూ ప్రచారం చేసారని అయితే తాను ఆ మూవీని తప్పుకోవడానికి నాగ్ కారకుడు కాడు అన్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడు ఆర్పీ పట్నాయక్. మొత్తంగా ఆర్పీ సినిమాల్లో మ్యూజిక్ ఎందుకు చెయ్యను అని చెప్పాడో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. అదీ మ్యాటర్…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.