ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. తన బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్‌పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘Prepare yourself for a vision beyond limits’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో అల్లు అర్జున్ ఓ రగ్డ్, వైల్డ్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్యాక్‌డ్రాప్ కూడా చాలా డార్క్ మరియు మిస్టీరియస్‌గా డిజైన్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ‘రాకా’ అనే పదానికి సంస్కృతంలో ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇది పౌర్ణమి రాత్రి లేదా పౌర్ణమి దేవతను సూచించడమే కాకుండా, చీకట్లను జయించే వెలుగును సూచించే ప్రతీకగా కూడా భావిస్తారు. ముఖ్యంగా పునర్జన్మల కాన్సెప్ట్, ద్విపాత్రాభినయం వంటి అంశాలతో కథను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కాగా ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి ‘రాకా’ టైటిల్ రివీల్‌తోనే ఈ సినిమా పాన్-వరల్డ్ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇక అసలు సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి!