అలాంటి ఆలోచనేం లేదు అనీ చెప్పడం లేదు. అదే ప్లాన్ చేస్తున్నాం అనీ చెప్పడం లేదు. కానీ వారానికోసారి ఏదో ఒక వార్త ఆ సినిమా గురించి ఏదో వార్త బయటకు వస్తూనే ఉంది. కొన్ని వార్తలు ఇటు టాలీవుడ్ నుండి వస్తుంటే.. ఇంకొన్ని అటువైపు కోలీవుడ్ నుండి వస్తున్నాయి. ఇక్కడి నుండి వస్తున్న వార్తలు హీరో చుట్టూ తిరుగుతుంటాయి. అటు నుండి అంటే తమిళ సినిమా వైపు నుండి వార్తలు ఎక్కువగా సినిమా ఓవరాల్ కాన్సెప్ట్ మీద నడుస్తుంటాయి.
తాజాగా ఈ వారం పుకారు అనేలా.. గతంలో అక్కడక్కడా రూమర్లుగా వినిపించిన ఓ వార్తను కన్‌ఫామ్ చేసేలా ఉన్నాయి. అదే ‘రాకా’ సినిమా రెండు పార్టులకు సంబంధించిన వార్త. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాను రెండు ముక్కలు చేయాలని ‘రాకా’ సినిమా టీమ్ రెడీ అయిపోయిందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ‘రాకా 1’ (Raaka) వస్తే.. 2028లో ‘రాకా 2’ను తీసుకొస్తారు. దీని మీద త్వరలో క్లారిటీ ఇస్తారు అని చెబుతున్నారు.
‘రాకా 1’, ‘రాకా 2’ అనే పేర్లు నార్మల్‌గా ఉన్నవే. వీటికి పూర్తి పేర్లు ఉంటాయట. అంటే ‘పుష్ప 1’ సినిమా కాస్తా ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2’ సినిమా ‘పుష్ప: ది రూల్’ అయినట్లు ‘రాకా’ (Raaka) పార్టులు కూడా పూర్తి పేర్లకు వస్తాయి. నిజానికి సినిమాను ఒకే పార్టుగా తీసుకొచ్చి.. ఆ తర్వాత చూద్దాం అనుకున్నారట. కానీ ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా వసూళ్లు అందుకోవాలి అంటే రెండు పార్టులు చేయడమే బెస్ట్ అని అనుకుంటున్నారట.
అయితే, ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎక్కడా క్లారిటీ సమాచారం అయితే రాలేదు. ఇప్పటివరకు వచ్చిన స్పష్టమైన సమాచారం ఏదైనా ఉంది అంటే ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పడుకొణె. నిర్మాత సన్ పిక్చర్స్. ఇది కాకుండా ఇప్పటివరకు ఇంకే సమాచారం ఇవ్వలేదు. టైటిల్, డేట్ రివీల్ కోసం గ్రాండ్ ఈవెంట్ పెడతారని సమాచారం.