Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

[Click Here For Detailed Review]

మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందిన హర్రర్ అండ్ ఫాంటసీ మూవీ ‘రాకాస’ (Raakaasaa). ‘కమిటీ కుర్రోళ్ళు’ తర్వాత నిహారిక నిర్మాణంలో రూపొందిన సినిమా కావడం, ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ తర్వాత సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా కావడంతో ‘రాకాస’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకి తగ్గట్టే.. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. టీజర్ , ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి.

Raakaasaa Movie

అలాగే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సైతం రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. దాంతో మార్కెటింగ్ , బిజినెస్ వంటివి బాగా వర్కౌట్ అయ్యాయి. థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ ..లు బాగా జరిగాయి. నిహారిక ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొందరు ప్రముఖులకు షో వేశారు. వారి టాక్ ప్రకారం … రాకాస (Raakaasaa) సినిమా నిడివి 2 గంటల 13 సెకన్లు కలిగి ఉంటుందట. స్టార్టింగ్ లో వచ్చే హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయట. సంగీత్ శోభన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండీ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు.

ముఖ్యంగా గెటప్ శీను ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది అని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్లాక్ , అక్కడ ఇచ్చే సస్పెన్స్ సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తిస్తాయి అని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని బ్యాక్ స్టోరీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అంటున్నారు. మొత్తంగా సినిమా అయితే అందరినీ ఆకట్టుకునే విధంగానే ఉందట. బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

[Click Here For Detailed Review]

.

 

 ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus