Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

నిర్మాతగా చేసిన తొలి సినిమా ‘క‌మిటీ కుర్రోళ్ళు’తో భారీ విజయాన్ని అందుకుంది మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌. దీని తర్వాత హారర్ ఫాంటసీ జోనర్లో ‘రాక‌స‌'(Raakaasaa) చేసింది.

Raakaasaa

సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాతో మాన‌స శ‌ర్మ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెట‌ప్ శీను, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సినిమా.

టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. పైగా సంగీత శోభన్ ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉండటం వల్ల ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది అని చెప్పాలి. వాటి వివరాలతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

తెలంగాణ 5 cr
సీడెడ్ 2 cr
ఆంధ్ర(టోటల్)  5 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.5 cr
వరల్డ్ వైడ్ టోటల్ 14.5 cr

‘రాకాస’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.14.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చెప్పాలంటే ఇది చిన్న టార్గెట్ అయితే కాదు. కానీ పాజిటివ్ టాక్ కనుక వస్తే సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. హర్రర్ ఫాంటసీ జోనర్ సినిమాలకి ఆ రేంజ్ సత్తా ఉంది.

‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus