మహా అయితే హీరోయిన్ల చేత ఎక్స్ పోజింగ్ చేయించడం, మరీ ఎక్కువ అనుకొంటే రెండుమూడు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పించడం మినహా హీరోయిన్స్ కు నటించడానికి పెద్దగా ఆస్కారం ఇవ్వరు. అందుకు తగ్గట్లుగానే ప్రెజంట్ ట్రెండ్ హీరోయిన్స్ అందరూ కేవలం అందాల ప్రదర్శనపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ నటనపై చూపడం లేదు, దర్శకులు కూడా వారిని ఆ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ.. నన్ను మాత్రం అలా చూడకండి అని చెప్పకనే చెబుతోంది బొద్దుగుమ్మ రాశీఖన్నా.
ఇటీవల చికాగో వెళ్ళిన రాశీ.. అక్కడ ఓ సాహసాన్ని చేసింది. అదేదో మామూలు సాహసం కాదండీ బాబు.. ఏకంగా 14000 అడుగుల ఎత్తు నుంచి ఉన్నపళంగా దూకేసింది. అంటే అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకొందనుకోండి. అక్కడ అమ్మడు విమానం నుంచి సరిగ్గా 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసింది. చేయడమే కాకుండా.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేసి అందరికీ తన సాహసకృత్యాన్ని చూపించింది!