అందాన్ని కాక నటనను మెచ్చుకొంటున్నారు!

  • October 30, 2017 / 01:32 PM IST

ఒక సినిమాలో హీరోయిన్ ను మహా అయితే అందంగా కనిపించిందంటారు లేదా పర్వాలేదనిపించిందంటారు. కానీ.. “హీరోయిన్ అద్భుతంగా నటించింది” అని చాలా తక్కువ సినిమాలకు వింటుంటాం. నిత్యామీనన్, నివేదా థామస్ లాంటి హీరోయిన్స్ వరకూ పర్లేదు కానీ కమర్షియల్ హీరోయిన్స్ ఈ తరహా ప్రశంసలు అందుకోవడం అనేది చాలా అరుదు.

అయితే.. బొద్దుగుమ్మ రాశీఖన్నా ఇటీవల తన మలయాళ డెబ్యూతో నటన పరంగా విశేషమైన ఆదరణ చూరగొంటోంది. మలయాళ చిత్రం “విలన్”తో మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో నటించిన రాశీఖన్నా.. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస్ పాత్ర పోషించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన రాశీఖన్నాకు దొరక్కదొరక్క దొరికిన అవకాశం కావడంతో ఆహారహం శ్రమించి పాత్రను పండించింది. దాంతో అమ్మడి పెర్ఫార్మెన్స్ కి మలయాళ క్రిటిక్స్ అందరూ సాహో అంటున్నారు. “విలన్” సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. తనకు “ఊహలు గుసగుసలాడే” విడుదలైన రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొంది రాశీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus