వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు : రాధికా ఆప్టే

  • October 26, 2020 / 01:15 PM IST

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ బోల్డ్ పాత్రల్లో నటిస్తుంది రాధికా ఆప్టే. తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటుంది. నటన పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం బ్రిటన్ కి చెందిన బెనెడిక్ట్ టేలర్ అనే మ్యుజీషియన్‌ ను పెళ్లి చేసుకుంది. బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రాధికా ఎక్కువగా ఇండియాలో ఉంటుంది. ఇక్కడే సినిమాలు చేస్తూ జీవిస్తోంది. అప్పుడప్పుడు తన భర్త కోసం లండన్ వెళ్తుంటుంది.

కెరీర్ కోసం మ్యారీడ్ లైఫ్ ని త్యాగం చేస్తున్నారా..? అని ఓ ఇంటర్వ్యూలో ఆమెని ప్రశ్నించగా.. తాను పెళ్లి చేసుకున్నది వీసా కోసమే అంటూ షాకిచ్చింది. విదేశాల్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులువుగా వస్తుందని తెలుసుకున్న తరువాత పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన జీవితానికి హద్దులు లేవని.. వివాహాన్ని నమ్మే వ్యక్తిని కానని.. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని తేల్చి చెప్పింది. వీసా పొందడం సమస్యగా మారిన తరువాత కేవలం దానికోసమే పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది.

కానీ ఇద్దరం కలిసి జీవించాలని మాత్రం అనుకున్నామని.. పెళ్లి మాత్రం వీసా కోసమే చేసుకున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. తన భర్తతో లండన్ లో గడుపుతోంది. తెలుగులో ఈమె ‘లెజండ్’, ‘లయన్’ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే బాలీవుడ్ లో బిజీ అయిపోవడంతో తెలుగు సినిమాల్లో నటించే సమయం ఆమెకి దొరకడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus