ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా..?

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది రాధికా ఆప్టే. పరిటాల రవి జీవితకథతో తెరకెక్కించిన ఈ చిత్రంలో పరిటాల భార్య సునీత పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రాణం పోసింది రాధికా ఆప్టే. ఇక తరువాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘లెజెండ్’ చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ‘లయన్’, రజినీకాంత్ ‘కబాలి’ చిత్రాల్లో కూడా నటించినప్పటికీ ఆ సినిమాలు ఆమెకు పెద్ద పేరుని తీసుకురాలేదనే చెప్పాలి. ఇక అదే టైములో ఓ టాలీవుడ్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసి టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడికి పబ్లిసిటీ స్టంట్లు బాగా తెలుసనే చెప్పొచ్చు.

ఇక వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఉండడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ కుర్ర కారుని హీటెక్కిస్తుంటుంది. తాజగా ప్రముఖ ‘వోగ్ కవర్’ షూట్ లో పాల్గొన్న రాధిక ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఛమ్కీ ఫోటోలో సైడ్ స్ట్రిప్’ లుక్ తో తెగ వేడెక్కిస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఉన్న కాంపిటిషన్ ను తట్టుకుని నిలబడాలి అంటే ఇలాంటి హాట్ హాట్ ఫోటో షూట్లు చాలా అవసరం అని ఈ భామ భావిస్తోందట. ఇలాంటి ట్రిక్స్ ఈమెకు చాలా తెలుసని బాలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

 

12

13

 

14

15

16

17

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus