రాధిక సినిమా అక్కడ వారి కోసమే!

  • August 22, 2016 / 01:25 PM IST

ఇటీవల రాధిక ఆప్టే నటించిన ‘పర్షధ్’ అనే సినిమాకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. ఈ సినిమా ఒకటుందని తెలియని వారు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి కలిగింది. ఈ వీడియోలో రాధిక ఆప్టే అర్ధనగ్నంగా కనిపించడంతో కావాలనే హైప్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో లీక్ చేశారనే వార్తలు వినిపించాయి.

లీనా యాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అజయ్ దేవగన్, అసీమ్ బజాజ్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమాను ఇండియాలో విడుదల చేసే ఆలోచన దర్శక నిర్మాతలకు లేదట. ఇతర దేశాల్లో ఇటువంటి తరహా సన్నివేశాలు ఉండడం సహజం కనుక అక్కడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించామనేది దర్శకనిర్మాతల మాట. నిజానికి ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ నుండే ఈ సీన్స్ ను
లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus