‘ద వెడ్డింగ్‌ గెస్ట్‌’ నుండీ రాధికా ఆప్టే.. శృంగార సీన్ లీక్..!

సంచలన నటి రాధికా ఆప్టే నటిస్తున్న తాజా ఆంగ్ల చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండీ కొన్ని హాట్‌ రొమాంటిక్‌ సీన్లు లీకయ్యి… ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సీన్ లో రాధికా ఆప్టే, హీరో దేవ్ పటేల్ న్యూడ్ గా కనిపిస్తున్నారు. అయితే లీకైన కొన్ని గంటలకే ఈ సీన్లను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే సోషల్ మీడియా అంతా పాకేసాయి. ఇక ఈ సీన్ లీకవ్వడం పై రాధికా ఆప్టే తీవ్రంగా మండిపడింది.

రాధికా ఆప్టే మాట్లాడుతూ… “సమాజంలో నెలకొనివున్న సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ సీన్‌ లీక్ కావడమే ఉదాహరణ. ఈ సీన్ లో నాతో పాటు దేవ్ పటేల్ నటించినప్పటికీ.. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్ధంకావడం లేదు. ఈ చిత్రంలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి.. కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ చేశారు. ఇది ఎవరో కావాలని చేసిందే…! బోల్డ్ సీన్లలో నటించేందుకు నేనేమి భయపడను. చిన్నప్పటి నుండీ సినిమాలు చూస్తూనే పెరిగాను. నటీ నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తాను” అంటూ మండిపడింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus