రాఘవేంద్ర రావు ప్రయోగాత్మక చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో?

  • May 31, 2019 / 11:48 AM IST

ఇటీవల ఎన్టీఆర్ జయంతి నాడు ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రకటించారు దర్సకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఈ చిత్రం ముగ్గురు దర్సకులతోనూ అలాగే ముగ్గు హీరోయిన్లతోనూ ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఊ ఆసక్తి కరమైన వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో ఓ కుర్ర హీరో నటించాబోతున్నాడట. దీంతో పాటు ముగ్గురి దర్శకుల్లో ఓ దర్శకుడి పేరు
బయటకు వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోగా నాగశౌర్య ను అనుకుంటున్నారట. ఈ చిత్రం కథ విన్న తరువాత ఈ హీరో బాగా ఎక్సైట్ అయ్యాడట.అయితే ఈ చిత్రానికి ఇంకా నాగశౌర్య సైన్ చేయలేదని సమాచారం. అయినప్పటికీ ఈయనే దాదాపు ఫైనల్ అయ్యే ఎక్కువ ఉన్నాయట. ఇక ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్ అని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తరువాత క్రిష్ చేస్తున్న చిత్రం ఇదే అని తెలుస్తుంది. మరో ఇద్దరు డైరెక్టర్లు రాఘవేంద్ర రావు శిష్యులని టాక్. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus