“అర్జున్ రెడ్డి, గీత గోవిందం, సమ్మోహనం” చిత్రాల్లో తన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని అలరించిన రాహుల్ రామకృష్ణ “భరత్ అనే నేను” చిత్రంలో చిన్న పాత్రే అయినప్పటికీ.. ఎమోషల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ సినిమాలో తన రోల్ ఇంకా చాలా ఉన్నప్పటికీ.. మహేష్ బాబు కావాలనే కట్ చేయించాడని, తన క్యారెక్టర్ ఎక్కడ మహేష్ బాబు పాత్రను డామినేట్ చేస్తుందనే భయంతో మహేష్ అలా చేశాడని కామెంట్ చేశాడట రాహుల్ రామకృష్ణ.
“భరత్ అనే నేను” విడుదలై ఏడాది పూర్తయిపోగా ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకు బయటకి వచ్చాయనే కదా డౌట్. ఈ విషయాన్ని చెప్పింది రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో “మిఠాయి” అనే చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ అనే దర్శకుడు. షూటింగ్ టైమ్ లో రాహుల్ రామకృష్ణ చాలా చిరాకు పెట్టేవాడని. పైన పేర్కొన్నట్లు మహేష్ బాబు మీద కూడా చాలాసార్లు అవాకులుచవాకులు పేలినట్లు పేర్కొన్నాడు ప్రశాంత్. మరి ఇలాంటి ఎలిగేషన్స్ కు రాహుల్ రామకృష్ణ ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి.