Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Advertisement

వాస్తవాలే మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు థియేటర్ పరిస్థితి అస్సలు బాలేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఇందుకు కారణం ఏంటి? అంటే సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు ఒకలా చెబుతారు. డిస్ట్రిబ్యూటర్లు ఇంకోలా చెబుతారు.

Rahul Ramakrishna

ఓటీటీ, ఐపీఎల్ వంటి వాటి వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేది ఇండస్ట్రీ పెద్దల మాట. మరోవైపు పెద్ద సినిమాలు రాకపోవడం వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేది డిస్ట్రిబ్యూటర్ల మాట.

ఈ రెండిటిలో ఏది నిజం అని మీడియా వారిని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఇంకోలా ఉంటుంది. టికెట్ రేట్లు, పాప్-కార్న్ రేట్లు పెరిగిపోవడం వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదు అని మీడియా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు.వీటిల్లో కొంత నిజం ఉంది. కానీ గుర్తించాల్సిన కఠిన వాస్తవాన్ని అందరూ దాచేస్తున్నారు. అదే ‘క్వాలిటీ కంటెంట్’.ఈ విషయం పై కుండ బద్దలుగొట్టాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna). తన ట్విట్టర్ వేధికగా ఈ విషయాన్ని బయట పెట్టాడు.

‘సామాన్యుడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ వంటి విషయాలపై ప్రేక్షకుడికి’ అవగాహన పెరిగింది. అయినా సరే, ఇంకా పాత కథలతో, పేలవమైన మేకింగ్‌తో సినిమాలు ప్రేక్షకులపై వదులుతూ, అవి ఆడకపోతే ప్రేక్షకులను నిందించడం కరెక్ట్ కాదు. సినిమా అనేది ఒక ‘మిస్టికల్ ఆర్ట్’ అని మేకర్స్ భావించే రోజులు పోయాయి.పెట్రోల్ ఖర్చులు, మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలు కలిగిన స్నాక్స్, పార్కింగ్ ఛార్జీలు కలుపుకుంటే ఒక సామాన్య కుటుంబానికి సినిమా చూడటం భారంగా మారింది.

ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్ళినప్పుడు, కేవలం మొబైల్ స్క్రీన్‌ క్వాలిటీతో సినిమా ఉంటే ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. థియేటర్‌లో మాత్రమే పొందగలిగే ఒక అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకి అందించాలి. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటే అది ఒక హెచ్చరిక మాత్రమే. రొటీన్ కథలు, అవుట్ డేటెడ్ మేకింగ్ పద్ధతులను వదిలిపెట్టి, ప్రేక్షకుడి టైంకి,డబ్బుకు విలువ ఇచ్చే విధంగా సినిమాలు రూపొందించాలి.

అప్పుడే థియేటర్లు కళకళలాడతాయి. మేకర్స్ ఇగోలతో సినిమాలు తీస్తే వర్కౌట్ కాదు.ఇవి గమనించాలి’ అంటూ ఇచ్చిపడేశాడు రాహుల్ రామకృష్ణ. ఇతని ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus