బిగ్ బాస్ హౌస్ విన్నర్ అయ్యాడు.. కానీ సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడు

  • November 7, 2019 / 01:33 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచి 50 లక్షల రూపాయల బహుమతి గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. అయితే.. ఈ బిగ్ బాస్ హడావుడిలో రాహుల్ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాడని తెలుస్తోంది. నిజానికి “అల వైకుంఠపురములో” చిత్రంలోని లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ “రాములో రాముల” పాటను పాడింది రాహుల్. రఫ్ ట్రాక్ పాడిన రాహుల్ అనంతరం “బిగ్ బాస్” హౌస్ లోకి వెళ్లిపోయాడు. దాంతో వేరే ఆప్షన్ లేక తమన్ & త్రివిక్రమ్ లు అనురాగ్ కులకర్ణితో ఆ పాట పాడించారు. ఒకవేళ రాహుల్ హౌస్ లో లేకపోతే.. హ్యాపీగా ఆ పాట పాడి తన కెరీర్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ ను యాడ్ చేసుకొనేవాడు.

ఇకపోతే.. రాహుల్ సిప్లిగంజ్ కి ఇష్టమైన పునర్నవితో అతడి పెళ్లి చేస్తామని రాహుల్ పేరెంట్స్ ఇచ్చిన స్టేట్ మెంట్ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ & పునర్నవిల నడుమ ఆస్థాయి ప్రేమకథ ఏమీ నడవడం లేదని సమాచారం. ఏదో హౌస్ లో ఉన్నంతకాలం క్లోజ్ గా ఉన్నారు కానీ.. మరీ పెళ్లి చేసుకొనేంత ప్రేమ అక్కడ లేదు అంటున్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus