నెక్స్ట్ సినిమాపై రాజమౌళి ఏమన్నారంటే ?

  • March 17, 2017 / 10:10 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిధులు చెరిపేసిన డైరక్టర్ రాజమౌళి. ఈగ సినిమా అందరి దృష్టిని ఆకర్షిణా దర్శకధీరుడు బాహుబలి తో అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ తో అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంకా ఈ మూవీ తర్వాత ఏ సబ్జెక్టు తో సినిమా తీస్తారని అందరికీ ఆసక్తిగా ఉంది. బాహుబలి తర్వాత ఇంతకన్నా గొప్ప సినిమా తీస్తారా? అని జక్కన్నని అడగగా… “‘బాహుబలి2’ విడుదలైన తర్వాత రెండు మూడు నెలలు సెలవులు తీసుకుని విహారానికి వెళ్ళిపోతాను.

అప్పుడు తర్వాత సినిమా గురించి ఆలోచిస్తా. అయితే ఒకటి మాత్రం పక్కా. బాహుబలి తర్వాత తీసే సినిమా వీఎఫ్‌ఎక్స్‌తో పనిలేకుండా సాదాసీదాగా తీస్తాను” అని  నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఎటువంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా జక్కన్న తీసిన సింహాద్రి రికార్డులను బద్దలు కొట్టింది. బహుశా అటువంటి కథతోనే సినిమా చేయవచ్చు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus