బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో మూవీ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ మొహాన్ని కప్పుకొని లాంగ్ కోటు వేసుకొని, మొబైల్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్న లుక్ ప్రభాస్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ ప్రముఖులను సైతం ఆకట్టుకుంది.
దీనిపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించక ఉండలేకపోయారు. “ఫస్ట్ లుక్ పోస్టర్లో కలర్స్, టెక్స్చర్స్ ను చాలా అందంగా వాడారు, సూపర్ స్టైలిష్ సాహో’ అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి వంటి కళాఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళి మెప్పు పొందడంతో.. సాహోపై క్రేజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.