సూర్యతో రాజమౌళి సినిమా.. ఈ ముచ్చట ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల క్రితంది. సుమారు 19 ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. అంతా ఓకే అనుకున్న సమయంలో వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రాజమౌళి తెలుగులో రామ్‌చరణ్‌తో ‘మగధీర’ అనే సినిమా చేశారు. ఈ సినిమా కథ, సూర్యతో అనుకున్న సినిమా కథ ఒకటే అని ఇప్పటివరకు ఎవరూ చెప్పకపోయినా.. రెండూ ఒకటే సమాచారం.
ఆ విషయం పక్కన పెడితే మరోసారి ఈ కాంబినేషన్‌లో చర్చలోకి వచ్చింది. దీనికి కారణం ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా. అవును కార్తికేయ, ఆర్కా మీడియా కలసి నిర్మించిన ఆ సినిమా తమిళ ప్రచారం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య విచ్చేశారు. ఇదే ఈవెంట్‌కి రాజమౌళి కూడా వచ్చారు. దీంతో మీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న వారికి ఎదురైంది.
ఈ ఈవెంట్లో ఈ ప్రశ్న ఎదురవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ముందే ప్రిపేరై వచ్చా అంటూ.. రాజమౌళి చెప్పడంతో ఏదో క్రేజీ అప్‌డేట్ ఇస్తారేమో అని అనుకున్నారంతా. కానీ ఆయన ‘నేను సూర్యతో సినిమా ఎప్పుడో చెబితే అది హెడ్‌లైన్ అయిపోతుందని, ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమా ఫోకస్ నుంచి పక్కకు వెళ్లిపోతుందది. అందకే దాని గురించి ఏమీ మాట్లాడనను అని అన్నారు రాజమౌళి. అంతే కాదు తాను, సూర్య ఎప్పుడు సినిమా చేసినా అది స్పెషల్‌గా ఉంటుందని తేల్చి చెప్పారు.
రాజమౌళి బ్యానర్ నుండి వస్తున్న సినిమా ప్రచారానికి సూర్య రావడంతో కచ్చితంగా ఇద్దరి సినిమా ఉందని ఆశావహులు ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు సూర్య 50వ సినిమా దగ్గర్లోనే ఉండటంతో ఆ సినిమా కోసం ఇద్దరూ కలసి పని చేయాలని కొందరు, కలసి పని చేస్తున్నారు అని మరికొందరు కథలు అల్లేస్తున్నారు. చూడాలి జక్కన్న ప్లాన్స్ ఎలా ఉన్నాయో. అలాగే ఆయనకు ఇంకే నిర్మాత దశాబ్దం క్రితం సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారో.