బాహుబలి కంక్లూజన్ లో నటించిన రాజమౌళి కూతురు

  • April 24, 2017 / 10:53 AM IST

బాహుబలి సినిమా కోసం రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులు శ్రమించారు. తెర వెనుకే కాకుండా తెర మీదకూడా కనిపించి మెప్పించారు. బాహుబలి బిగినింగ్ లో జక్కన్న “మత్తు” అమ్మే వ్యక్తిగా కనిపించి అలరించారు. అతని తనయుడు కార్తికేయ శివగామి చేతిలో చనిపోయే సైనికుడిగా నటించారు. బాహుబలి కంక్లూజన్ లో వీరిద్దరూ నటించారో తెలియదు కానీ, రాజమౌళి కూతురు మయూఖ నటించినట్లు తెలిసింది. శనివారం రిలీజ్ చేసిన “సాహోరో బాహుబలి” సాంగ్ ప్రోమో వీడియోలో గజరాజుపై వస్తున్న బాహుబలిపై పూలు చల్లే మహిష్మతి రాజ్య ప్రజల్లో ఆమె ఉంది.

మయూఖతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కూతురు అనన్య, సంగీత దర్శకుడు కీరవాణి కుమార్తె కుముధ్వతి, కెమెరామెన్ సెంథిల్ తనయులు రేయాన్, ధ్రువ లు కూడా నటించారు. ఈ పాటలోనే కనిపిస్తారా? వారిపై డైలాగ్ సన్నివేశాలు ఉంటాయో లేదో.. మరో నాలుగు రోజుల్లో తెలియనుంది. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న బాహుబలి పార్ట్ 2 ఈ శుక్రవారం థియేటర్లో సందడి చేయనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus