ప్రభాస్, ఎన్టీఆర్ లకు కొత్త రోల్స్ ఇచ్చిన రాజమౌళి

  • July 3, 2017 / 12:35 PM IST

దర్శకధీరుడు రాజమౌళికి ప్రభాస్, ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే వీరిద్దరితో ఆరు సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిచాయి. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్  ఇచ్చిన డైరక్టర్ ని ఈ హీరోలు నటన కాకుండా వేరే ఏ వృత్తి స్వీకరిస్తారు? అని అడిగితే.. ఇంట్రెస్టింగ్ గా వుందికదూ.. ప్రశ్న మాత్రమే కాదు .. అందుకు జక్కన్న ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది. దగ్గుబాటి రానా హోస్ట్ గా ‘నెంబర్ వన్ యారీ విత్ రానా’ షో చేస్తున్నారు. జెమినీ వారు నిర్మిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ కి నిర్మాత శోభుతో కలిసి రాజమౌళి హాజరయ్యారు. ఆయన్ను టాలీవుడ్ లో టాప్ హీరోలుగా రాణిస్తున్న ముగ్గురు ప్రముఖ హీరోలు.. నటులుగా కాకుండా వేరే వృత్తి తీసుకుంటే మీ ఛాయిస్ ఏమిటని రానా, రాజమౌళిని అడిగారు.

అందుకు అయన సమాధానమిస్తూ “ప్రభాస్ చెఫ్ గా, చరణ్ ను బిజినెస్ మ్యాన్, తారక్ కు పాలిటిక్స్” అని చెప్పారు.  పవన్, మహేశ్ బాబు పేర్లు విన్నంతనే టక్కున గుర్తుకు వచ్చే మూడు పదాలేమిటి? అన్న మరో ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ.. పవన్ పేరుకు నిజాయితీ, విశ్వాసం, ఆరాధన అని చెప్పగా.. మహేశ్ పేరుకు హ్యాండ్సమ్.. హ్యాండమ్స్.. హ్యాండ్సమ్ అని చెప్పి ఆకట్టుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus