దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతి సినిమాని మహా యజ్ఞంలా చేస్తుంటారు. అతను గుప్పిట విప్పేవరకు సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటికి రాదు. రీసెంట్ గా రామారావు, రామ్ చరణ్ తో తాను మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతకు మించి సినిమా కథ ఏంటి? బడ్జెట్ ఏంటి? ఇతర ఆర్టిస్టులు ఎవరు ? అనే విషయాలను ఎవరూ వెల్లడించడం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ని ఎంత అడిగినా కథ మాకు కూడా చెప్పలేదని జారుకున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్.. రష్మిక మందనను సెలక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
తారక్, చెర్రీలు అన్నదమ్ములుగా కనిపించనున్నట్లు తెలిసింది. తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాహుబలి రెండు చిత్రాలకు కలిపి 250 కోట్లు ఖర్చు అయింది. అందులో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి అంత అయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండదు. మరి ఇన్నికోట్లు ఎందుకు కేటాయించారు అనేది ఆసక్తికరంగా మారింది. అవతార్ మాదిరిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న నోరు విప్పేవరకు ఈ చిత్రం వరకు ఏ విషయాన్నీ నమ్మలేము.