టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తమ మారుమోగిస్తున్నాడు మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. అయితే దాదాపుగా రాజమౌళి బహుబలికి ఊహించుకున్న క్రేజ్ కు, కలెక్షన్స్ కి అత్యధికంగా వచ్చిన మాట నిజమే అని చెప్పాలి. అసలు జక్కన్న కూడా ఊహించి ఉండదు, అంచనాలను మించి ఒక సినిమా భారీ హిట్ అందుకుంటుంది అని. అయితే అదే క్రమంలో బాహుబలి సూపర్ సక్సెస్ అవడంతో ఒక్కసారిగా వర్ల్డ్ ఫేమస్ అయిపోయాడు రాజమౌళి. ఇక అదే క్రమంలో అటు కుటుంభంతో కలసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా…అసలు విషయం ఇక్కడే మొదలయింది. రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు? హీరో ఎవరు? నిర్మాత ఎవరు? అంటే ఇక్కడే అసలు మ్యాటర్ ఓపెన్ అవుతుంది. విషయంలోకి వెళితే రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందు ఇద్దరు ప్రముఖ నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు తీసుకున్నాడని, ఇప్పుడు అవే రాజమౌళికి ఒక సమస్యగా మారాయి అని ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్.
అయితే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన చూస్తుంటే రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే ప్రముఖ నిర్మాతలు డివివి దానయ్యకు మరియు కేఎల్ నారాయణలకు చెరో సినిమా చేస్తానని కమిట్ అయి వారి వద్ద నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే ‘బాహుబలి’ ప్రాజెక్ట్ ముగిసే వరకు ఓపిక పట్టిన వీళ్ళిద్దరూ, రాజమౌళి ఫ్రీగా ఉండడంతో నిర్మాతలు తమకు చెరొక సినిమా చేసి పెట్టమని రాజమౌళి పై ఒత్తిడి పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళి ఈ ఇద్దరి నిర్మాతలలో ఎవరో ఒకరి నిర్మాణ సంస్థలో తన తదుపరి సినిమాను ప్రారంభించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. మరి అసలే జక్కన్న భారీ హిట్ ఇచ్చిన తరువాత చిన్న సినిమా తీస్తాడు, మరి ఏ హీరోతో ఏ నిర్మాతకు సినిమా చేసీపెడతాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.