ప్రిన్స్ తోనే నెక్స్ట్ సినిమా అంటున్న రాజమౌళి?

  • May 13, 2017 / 10:10 AM IST

రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎవరితో? చిన్న సినిమా తీస్తాడా? లేదా మళ్ళీ భారీ బడ్జెట్ తో ఏమైనా ప్లాన్ చేస్తాడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం రాజమౌళి ప్రస్తుతానికి హాలిడే మూడ్ లో ఉన్నాడు. అయితే సినిమా విషయానికి వచ్చేసరికి ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అన్న వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అసలైతే బాహుబలి తర్వాత జక్కన్న కచ్చితంగా ఓ చిన్న సినిమా తీస్తాడని అందరూ అనుకుంటున్న క్రమంలో లేదు బాహుబలి రేంజ్ లోనే మరో సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఏంటి ఆ బడా సినిమా ఎవరితో అన్న కన్ఫ్యూషన్ కి క్లారిటీగా ఎన్నాళ్లనుండో మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్న రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తోనే చేసేందుకు సిద్ధమవుతున్నాడని సినిమా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ, ఇప్పటికే కే.ఎల్ నారయణ మహేష్, రాజమౌళి కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అయిన విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

అంతేకాకుండా ఆ ఇద్దరికి సినిమా చేయాలన్నట్టు కొంతమొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చాడట నారాయణ . అందుకే బాహుబలి తర్వాత మహేష్ తోనే సినిమా తీయాలని పట్టుపడుతున్నాడట నారాయణ. అయితే ఇప్పుడు  మహేష్ పూర్తిగా బిజీ, మురుగదాస్ సినిమా పూర్తి చేసుకుని కొరటాల శివ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తుంది. మరి ఇంత బిజీగా ఉన్న ప్రిన్స్ తో జక్కన్న సినిమా ఎలా అంటే?మహేష్ ఫ్రీ అయ్యేలోగా మర్యాద రామన్న లాంటి చిన్న సినిమా తీసి ఆ తర్వాత మళ్లీ మహేష్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కితే మాత్రం టాలీవుడ్ రికార్డులకు చెక్ పెట్టినట్లే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus