ప్రభాస్ కోసం రాజమౌళి కొత్త నిర్ణయం

  • December 19, 2016 / 09:36 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎవరికోసం పనిలో కాంప్రమైజ్ కారు. అనుకున్న షాట్ వచ్చేవరకు షూటింగ్ చేస్తుంటారు. తొందర పడరు. జక్కన్న తొలి సారి ఒత్తిడికి గురవుతున్నారు. రాత్రీపగలూ పనిచేస్తున్నారు. ఇలా కష్టపడేందుకు కారణం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అవును.. డార్లింగ్ కి ఇచ్చిన మాట కోసం రాజమౌళి గట్టి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ మొదటి వారానికల్లా బాహుబలి 2 షూటింగ్ ని పూర్తి చేస్తానని గతంలో జక్కన్న ప్రభాస్ కి మాట ఇచ్చారు. అతని మాట ప్రకారమే ప్రభాస్.. సుజీత్ సినిమాకి ఫిబ్రవరి నుంచి డేట్స్ కేటాయించారు. ఆ సినిమా కోసం బాడీని తగ్గించుకునేందుకు 45 రోజులు సమయం పడుతుంది.అందుకే ఫిబ్రవరి నుంచి ప్లాన్ చేసుకోమని డార్లింగ్ సుజీత్ కి చెప్పారు.

అందుకు తగినట్లుగా దుబాయ్ లో షూటింగ్ ని ప్లాన్ చేశారు. అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసారు ఆ చిత్ర నిర్మాతలు. అయితే పెద్ద నోట్ల రద్దు, బాహుబలి చిత్ర నిర్మాతలపై ఐటీ అధికారులు దాడి చేయడం వంటి కారణాల వల్ల బాహుబలి షూటింగ్ లో కొంత జాప్యం జరిగింది. దీంతో ఆర్టిస్టుల డేట్స్ పొడిగించాల్సి వచ్చింది. ప్రభాస్ కూడా మరో 20 రోజుల డేట్స్ ఇచ్చారు. మరో పదిరోజుల్లో ఆ డేట్స్ కూడా పూర్తికానున్నాయి. ఆ తర్వాత డేట్స్ అడగకూడదని భావించిన దర్శకధీరుడు అప్పటిలోపున షూటింగ్ ఫినిష్ చేయాలనీ శ్రమిస్తున్నారు. ఈనెల 27 కి  ప్రొడక్షన్ కి పేకప్ చెప్పి చిత్ర యూనిట్ కి డిసెంబర్ 31 ని పెద్ద పార్టీ ఇవ్వాలని భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus