‘గరుడవేగ’కు సీక్వెల్.. రాబోతుందా.. ?

  • March 12, 2019 / 06:52 PM IST

‘యాంగ్రీ స్టార్’ రాజశేఖర్… అంతకు ముందు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. మినిమం గ్యారంటీ హీరో అనే పేరు కూడా ఉండేది. అయితే స్టార్ హీరోలు… యువ హీరోల ధాటికి రాజశేఖర్ హడావిడి మొత్తం తగ్గిపోయింది. ఓ పక్క ఆయన సినిమాలు వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ… అసలు రాజశేఖర్ సినిమాల్లో నటిస్తున్నాడా అనే సందేహం కూడా అందరిలోనూ ఉండేది. సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్ లు విలన్లుగాను, సహ నటులుగానూ రాణిస్తున్నారు.. మరి మీరు కూడా ఆవైపు వెళ్తారా అని రాజశేఖర్ ని అడిగితే.. ఒక హిట్ సాదించిన తరువాత ఆ పాత్రల గురించి ఆలోచిస్తాను అని గతంలో చెప్పాడు. ఈ సమాధానం వినగానే అందరికీ రాజశేఖర్ ఇంకా హీరోనా… ? అందులోనూ హిట్ ఇవ్వడమా అని విమర్శలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అయితే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో చేసిన ‘గరుడ వేగ’ చిత్రం అయన నమ్మకం బలమైనదే అని నిరూపించింది.

ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. రాజశేఖర్ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రవీణ్ సత్తారు ఇంటెలిజెంట్ డైరెక్షన్… టేకింగ్ కు ఆడియన్స్ స్టన్ అయిపోయారు. కమర్షియల్ గా పెద్ద వర్కౌట్ కాకపోయినప్పటికీ… రాజశేఖర్ అనే మంచి హీరో ఇంకా మనకి ఉన్నాడు అనే నమ్మకాన్ని ఈ చిత్రం ఇచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తునట్టు స్వయంగా రాజశేఖర్ ప్రకటించాడు. ఇటీవల ‘మా అసోసియేషన్’ ఎలెక్షన్లలో విజయం సాధించిన రాజశేఖర్.. అనంతరం మీడియాతో జరిగిన సమావేశంలో ఈ ‘గరుడవేగ2’ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు.. నిర్మాత ఎవరు అనేది వెల్లడించలేదు. ప్రస్తుత ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు రాజశేఖర్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus