Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మొదటి ప్రయత్నంగా నితిన్ ‘ఎక్స్ ట్రా’ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో రాజశేఖర్ పాత్రకి ఎటువంటి అప్రిసియేషన్ రాలేదు. ఇప్పుడు శర్వానంద్ ‘బైకర్'(Biker) సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు.గతేడాది డిసెంబర్లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమాని.. 2026 సమ్మర్ కి వాయిదా వేశారు.

Biker

ఈరోజు అనగా ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ‘బైకర్’ లో రాజశేఖర్ ప్లే చేసిన బుల్లెట్ సునీల్ పాత్ర గ్లింప్స్ ను వదిలారు.

ఈ బుల్లెట్ సునీల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది ఒక నిమిషం నిడివి కలిగి ఉంది. ‘ఇది క్రికెట్ కాదు సునీల్. దీన్ని ఎవ్వడూ పట్టించుకోడు’ అంటూ బైక్ రేసింగ్ కి ఇండియాలో ఉన్న సిట్యుయేషన్ ని బుల్లెట్ సునీల్(రాజశేఖర్) అనే రేసర్ కి ఓ వ్యక్తి వివరించడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఆ బుల్లెట్ సునీల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటి అనే ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేశారు. ‘అతనొక ఫార్మర్ మోటో క్రాస్ రేసర్ అని,అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు.

18 ఇండియన్ ఛాంపియన్షిప్స్, 57 సౌత్ జోన్ టిటిల్స్, 100 కి పైగా రెసెస్’ అంటూ అతని గురించి శశాంక్ పాత్రతో వివరించారు. ‘ఇండియన్ రేసర్స్ డిజర్వింగ్ కాదు.. దే ఆర్ జస్ట్ లూజర్స్ అనే ఒపీనియన్ ఉంది’ అంటూ శశాంక్ పాత్ర రేసర్స్ గురించి పలకగా ‘ఒపీనియనే కదా మారుద్ధాం’ అంటూ రాజశేఖర్ కౌంటర్ ఇవ్వడం హైలెట్ గా అనిపిస్తుంది. మొత్తంగా ఈ పాత్రని ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. గ్లింప్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. మరి సినిమాలో ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఏప్రిల్ 3 న తెలుస్తుంది.

‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus