తేజ సినిమా తో విలన్ అవతారం ఎత్తనున్న హీరో రాజ శేఖర్

ఒకప్పుడు హీరో గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న  హీరో రాజశేఖర్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.పాపం చేతిలో సినిమాలు  లేకపోవడంతో తేజ దర్శకత్వం లో వస్తున్న ‘అహం’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.
ప్రస్తుతం రాజ శేఖర్ కి సినిమాలు లేకపోవడం తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బావిస్తున్నాడని వినికిడి.మరో వైపు తేజ పరిస్థితి కూడా ఇండస్ట్రీ లో అంతంతమాత్రం గానే ఉంది అని అందరికి తెలుసు.’హోరా హోరి’  సినిమా తో భారి ఫ్లాప్ చవిచూసాడు.ఇప్పటికే ఎ సినిమా కోసం కొత్త హీరోయిన్ ని వెదుకుతున్నాడు.
 ప్రేమ కథ సినిమాలు తప్ప మరే సినిమాలు తియ్యలేడు అనే అపవాదు ని చెరుపుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.రాజ శేఖర్ కూడా మళ్లీ తన ఉనికిని చాటుకోవాలని ఆరాటపడుతున్నాడు.ఎప్పటిలకే తేజ మళ్లీ నిరాసపరుస్తాడో లేక హిట్ తో నిలబడతాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus