సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజిని కాంత్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. 8 ఏళ్ళ తరువాత మళ్ళీ వీళ్లిద్దరి కలయిక లో ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 2.0 పై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాహుబలి సిరీస్ తరువాత ఏ పెద్ద సినిమా వచ్చిన కంటెంట్ లేదా కలెక్షన్స్ లో ఆ సినిమాల తో బాహుబలి ని కంపేర్ చేయడం మామూలు అయిపోయింది .ఇప్పుడు 2.0 కి కూడా అదే తరహా అంచనాలు ఉండడం సహజమే.
అయితే విడుదలకు ముందే 2.0 ,బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం విశేషం. ‘బాహుబలి ది కంక్లూజన్’ని ప్రపంచవ్యాప్తంగా 6,500 థియేటర్ లలో విడుదల కాగా, 2.0 సినిమా ని 6 ,800 థియేటర్ లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసిందని సమాచారం. శంకర్-రజిని భారీ కాంబినేషన్ తో పాటు ఉన్నత సాంకేతిక నిఫుణుల తో పాటు త్రీడి టెక్నాలజీ ,మరియు 4 డి సౌండ్ వంటి హంగుల తో రాబోతున్న ఈ చిత్రం ఒక విజువల్ వండర్ గా ఉండబోతుంది అనే దాంట్లో సందేహం లేదు. మరి చూద్దాం ఈ చిత్రం విడుదల తరువాత ఎన్ని రికార్డు లు బద్దలు కొడుతుందో.