రజినీకాంత్ కి జోడీగా నటించనున్న సిమ్రాన్

  • July 5, 2018 / 04:33 PM IST

కాలా సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్… కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్టు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే నిజం కాదని ఈరోజు తెలిసింది. మొదటి ఆమెనే అనుకున్నప్పటికీ డేట్స్ కుదరకపోవడం వల్ల ఆమె ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆ స్థానంలో సిమ్రాన్ ఎంపికయినట్లు తెలిసింది. గతంలో ఒక్కమగాడు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమని సిమ్రాన్ ఓ ఊపు ఊపింది.

టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసి విజయాలు అందుకుంది. పెళ్లితర్వాత సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో సిమ్రాన్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాబీ సింహ, విజయ్ సేతుపతి తదితరులతో పాటు లై సినిమాలో నటించిన మేఘ ఆకాష్ కూడా ఇందులో ఓ రోల్ చేయనుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ త్వరలో డార్జిలింగ్ లో మొదలుకాబోతోంది. 40 రోజులపాటు నాన్ స్టాప్ గా షూటింగ్ సాగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పిజ్జా, జిగర్‌తండ, ఇరైవి చిత్రాలతో ప్రతిభను చాటుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus