కాలా రిలీజ్ విషయం ఇంకా రాని క్లారిటీ.!

  • April 4, 2018 / 01:56 PM IST

ఆలిండియా సూపర్ స్టార్ లాంటి రజనీకాంత్ సినిమా రిలీజవుతుందంటే హడావుడి ఏ స్థాయిలో ఉండాలి. కానీ.. విచిత్రంగా రజనీకాంత్ నటించిన తాజా చిత్రమైన “కాలా” విడుదలకు రెడీ అవుతుంటే మాత్రం కనీసం ఒక నార్మల్ బడ్జెట్ సినిమాకి జరగాల్సిన హల్ చల్ కూడా అవ్వడం లేదు. నిన్న “కాలా” సెన్సార్ పూర్తయ్యింది, 14 కట్స్ తో “యు/ఎ” సర్టిఫికేట్ అందుకొన్న ఈ చిత్రం నిజానికి ఏప్రిల్ 27న విడుదలకావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ సర్టిఫికెట్ తోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేస్తారు. కానీ.. “కాలా” విషయంలో మాత్రం అలా చేయలేదు. పైగా సినిమా సంబంధించి టీజర్ ను రిలీజ్ చేయడం మినహా మరో ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పటివరకూ జరగలేదు.

రజనీకాంత్, హ్యూమా ఖురేషీ, నానా పటేకర్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలవ్వడం కష్టమని తెలుస్తోంది. అందుకే సెన్సార్ అనంతరం విడుదల తేదీని ఎనౌన్స్ చేయలేదట. రజనీకాంత్ కూడా ప్రస్తుతం పోలిటికల్ పార్టీని సెట్ చేసుకొనే హడావుడిలో ఉండడం వల్ల సినిమాల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇక ఆయన నటించిన మరో చిత్రమైన “రోబో 2” పరిస్తితి కూడా అలానే ఉంది. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా దర్శకనిర్మాతలకే క్లారిటీ లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus