రజనీకాంత్ జీవితం పై సినిమా

  • August 11, 2016 / 11:48 AM IST

బస్ కండక్టర్ స్థాయి నుంచి  సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ అంటే ఎంతో మందికి స్ఫూర్తి. అయన నటనే కాకుండా అతని ప్రవర్తన చూసి ఫ్యాన్స్ అయినా వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రజనీ జీవితం సినిమా తీయాలని అయన కుమార్తెలు భావిస్తున్నారు. పెద్ద కూతురు ఐశ్వర్య తండ్రి పై ఓ పుస్తకాన్ని రాసే పనిలో బిజీగా ఉన్నారు.

చిన్న కూతురు సౌందర్య కి  మాత్రం అప్ప లైఫ్ పై సినిమా ఎందుకు తీయకూడదని ఆలోచన వచ్చింది. ఆ చిత్రం ఎంతోమందికి తప్పకుండా ఇన్స్పిరేషన్ అవుతుందని నమ్మకంతో ముందుకు అడుగు వేయబోతోంది. ఈ మూవీలో రజనీ గురించి అందరికీ తెలిసిన విషయాలు కాకుండా, ఇదివరకు వెల్లడించని, ఎవరికీ తెలియని విషయాలు చెప్పాలని సౌందర్య అక్క ఐశ్వర్య కి చెప్పడంతో ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. ప్రస్తుతం అక్కచెల్లెలు ఇద్దరు కలిసి రజనీ  జీవితంలోని ముఖ్య ఘట్టాలను, సవాళ్లను అభిమానులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దర్శకత్వ భాద్యతలను ఐశ్వర్య తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రజనీ కాంత్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమా కోసం శ్రమిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తన బయో పిక్ లో నటించేందుకు సూపర్ స్టార్ రెడీ కానున్నాడన్న మాట. ఇది రజనీ అభిమానులకు సంతోషం కలిగించే వార్త అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus