కబాలి కలెక్షన్స్ అదరహో!

  • July 26, 2016 / 08:14 AM IST

భారీ అంచనాల నడుమున విడుదలయిన క‌బాలి తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల‌ను క్రాస్ చేసేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. క‌బాలి త‌మిళ‌నాడులో తొలి రోజు రూ 21.5 కోట్లు వ‌సూలు చేసి పాత రికార్డుల‌కు తిరగరాసింది. అమెరికాలో తొలి రోజు 4.5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

ఏపీలో ఫ‌స్ట్ డే రూ.8 కోట్లు వ‌సూలు చేయ‌గా గుంటూరులో రూ.90 ల‌క్ష‌లు, వైజాగ్‌లో రూ.98 ల‌క్ష‌లు, కృష్ణాలో రూ.65 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. బెంగ‌ళూరులోని అన్ని థియేట‌ర్ల‌లోను క‌బాలినే ఆడుతోంది. క‌ర్ణాట‌క హ‌క్కుల‌ను లింగా నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేష్ రూ.10 కోట్ల‌కు సొంతం చేసుకున్నాడు. అక్క‌డ కూడా క‌బాలి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.  ఇలా టాక్ నెగిటివ్‌గా ఉన్నా క‌బాలికి వ‌సూళ్లు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. అయితే రూ.220 కోట్ల ప్రి  రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో క‌బాలి ఎంత మేర వ‌సూళ్లు సాధిస్తుంద‌న్న‌దే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus