రజనీకాంత్ ఫ్లాప్ సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ చేయలేకపోయింది

ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ హీరో రజనీకాంత్, ఇండియాస్ టాప్ డైరెక్టర్ శంకర్ ల క్రేజీయస్ట్ కాంబినేషన్ కూడా మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డ్స్ ను బ్రేక్ చేయడం కాదు కదా కనీసం దరిదాపులకు కూడా చేరలేకపోయింది. నిన్న విడుదలైన “2.0” యునానిమస్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేయబడిన విషయం తెలిసిందే. కనెక్ట్ అయ్యే కథ లేకపోయినా.. విజువల్ గా అద్భుతంగా ఉన్న ఈ చిత్రం తప్పకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్రం తప్పకుండా బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ చేస్తుందని భావించారు అందరూ. నిన్నటి యునానిమస్ టాక్ చూశాక రికార్డ్స్ బ్రేక్ అవ్వడం కన్ఫర్మ్ అని కూడా అనుకున్నారు.

కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. బాహుబలి రికార్డ్స్ పక్కన పెడితే.. కనీసం రజనీకాంత్ ఫ్లాప్ సినిమా అయిన “కబాలి” డే 1 రికార్డ్స్ కూడా ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఫస్ట్ డే 110 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసిన 2.0కి ప్రస్తుతం ఉన్న మిక్స్డ్ టాక్ వల్ల భారీ స్థాయి రికార్డ్స్ దక్కడం మాత్రం గగనమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus