మొత్తానికి హిట్ లిస్ట్ లో చేరిన ‘రాజుగారి గది 3′

  • October 25, 2019 / 01:30 AM IST

అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజుగారి గది3’. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18 న విడుదలై మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ చిత్రానికి చాలా బ్యాడ్ రివ్యూలు వచ్చాయి. స్టోరీ లేదు చీప్ కామెడీ అంటూ ఫిలిం విశ్లేషకులు ఈ చిత్రాన్ని ఏకిపారేసారు. అయితే ఆ రివ్యూలను ప్రేక్షకులు తిప్పికొట్టినట్టే తెలుస్తుంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి 5 కోట్లకు పైనే షేర్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ కూడా ఈ చిత్రానికి తక్కువే జరిగింది.

దర్శకుడు ఓంకార్ ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్డెట్ లో రూపొందించాడు కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ దక్కిందని కొందరు అంటున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలకి రెండో రోజు కోటి షేర్ కూడా రావడం కష్టమైపోతుంది.. అని గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం బాగా రాబట్టింది. మొత్తానికి 6 కోట్లకు పైనే ఈ చిత్రానికి షేర్ వచ్చే అవకాశం ఉంది. ‘రాజు గారి గది’ సిరీస్ పై కూడా మొదటి నుండీ మంచి క్రేజ్ ఉంది కాబట్టి జనాలు రివ్యూలను అస్సలు పట్టించుకోకుండా.. థియేటర్లకు వెళ్ళారు అని తెలుస్తుంది.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus