‘సెన్సార్ బోర్డ్’ని తీసేయ్యండి – ఐటమ్ బాంబ్!!!

  • September 5, 2016 / 11:27 AM IST

రాఖీ సావంత్….ఈ బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ తాను సెన్సార్ బోర్డ్ చీప్ గా మారిపోతాను అంటుంది. అక్కడ పరిస్థితులు అస్సలు బాలేదు అని, ఎలా అయినా అక్కడి పరిస్థితులని చక్క దిద్దాలి అని మండి పడుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటీ అంటే….ప్రస్తుతం రాఖీ సావంత్ నటించిన రాఖీ సావంత్ నటించిన మూవీ ‘ఏక్ కహానీ జూలీ కీ’ అనే మూవీ రిలీజ్ కి రెడీ అయింది. రీసెంట్ గా ఫైనల్ కాపీని సెన్సార్ కి పంపిస్తే.. వాళ్లు ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ చూడగానే రాఖీ కోపంతో ఊగిపోయింది. సెన్సార్ బోర్డ్ చాలా భాద్యతారాహిత్యంగా వ్యవ్యాహరిస్తుంది అని. ‘సెన్సార్ బోర్డ్ ను మూసేయాలి.

బడా ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సొమ్ములు దండుకోవడం తప్ప వాళ్లు ఇంకేమి చెయ్యడం లేదు అని, అంతేకాకుండా చిన్న నిర్మాతలను వేధింపులకు గురి చేస్తున్నారు అని, ఇంకా చెప్పాలి అంటే…అవసరమైతే ఆ ప్లేస్ లో నేను కూర్చుని అక్కడి ప్రాబ్లమ్స్ ని చక్కదిద్దుతాను అని అంటుంది. అంతేకాకుండా…అసలు తమ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి అసలు కారణం ఏంటో తెలపాలి అని, తాను నటించడమే దానికి ఎందుకు కారణం అని, తాను పోర్న్ స్టార్ ని కాదని.. ఈ దేశపు ఆడబిడ్డనని.. ఎలాంటి అసభ్య దృశ్యాలు లేని తమ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని సెన్సార్ బోర్డ్ ను ఒక రౌండ్ వేసుకుంటి రాఖీ. అంతేకాదు దీనిపై కోర్ట్ కి కూడా వెళ్తుందట. చూద్దాం ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus