రకుల్ చాలా తగ్గిందండోయ్..!

  • April 2, 2019 / 06:25 PM IST

చెప్పుకోవడానికి పెద్ద హిట్లేమీ లేవు… అయినా సరే పెద్ద హీరోల సరసన ఛాన్సులు దక్కాయి. అయినా పెద్ద హిట్లేమీ రాలేదు… కానీ అప్పటికీ పెద్ద ఛాన్సులు రావడం ఆగలేదు. కానీ ప్రతీసారి టైం ఒకేలా ఉండదు కథా. ఈ సారి పెద్ద ఆఫర్లు వచ్చినా.. పక్కన కుర్ర హీరోయిన్లు పెరిగారు. హిట్లు లేకపోయినా ఎక్కువ డబ్బులిచ్చి పెద్ద హీరోయిన్ దగ్గరకి వెళ్ళడం కంటే కుర్ర హీరోయిన్లు నమ్ముకోవడం బెటర్ అని ఈ భామని పక్కన పెట్టేసారు. ఇంతకీ ఎవరు ఈ భామ అనుకుంటున్నారా..? ఇంకెవరండీ మన రకుల్ ప్రీత్ సింగ్. మొదట్లో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ వంటి చిన్న హిట్లు అందుకున్న ఈ భామకి వరుసగా చరణ్, ఎన్టీఆర్ ల సరసన ఛాన్స్ లభించింది. అవే ‘బ్రుస్ లీ’ ‘నాన్నకు ప్రేమతో’…!ఇవి కూడా భారీ హిట్లేమీ కాదు… కానీ ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా అల్లు అర్జున్, మహేష్ బాబు, వంటి స్టార్ల పక్కన ఛాన్సులు వచ్చాయి.కానీ కుర్ర హీరోయిన్ల రావడం, రకుల్ రెమ్యూనరేషన్ ని నిర్మాతలు తట్టుకోలేక పోవడంతో ఆఫర్లు తగ్గుమొకం పట్టాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ కు వచ్చి సీనియర్ హీరో చిన్న హీరో అని లేదు…! అందరి పక్కన చేయడానికి ఓకే చెప్పేస్తుంది. ఇందులో భాగంగా సీనియర్ హీరో నాగార్జున సరసన ‘మన్మధుడు2’ లో హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటూ కళ్యాణ్ రామ్ సరసన ‘తుగ్లగ్’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. గతంలో కాజల్, తమన్నా కూడా ఇలాగే.. తమ రేంజ్ ను కాస్త పక్కన పెట్టి ట్రై చేసారు. కాజల్ మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ చేసింది అలాగే కుర్ర హీరో సాయి శ్రీనివాస్ తో కూడా నటిస్తుంది. తమన్నా కూడా అంతే … వెంకటేష్ తో ‘ఎఫ్2’ చేసింది అలాగే కళ్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ కూడా చేసింది. వీరి బాటలోనే రకుల్ కూడా సీనియర్ హీరో నాగార్జున సరసన, అలాగే కళ్యాణ్ రామ్ తో నటించబోతుందన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus