ధృవ లో ఎక్స్ పోజింగ్ పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్

  • December 9, 2016 / 11:07 AM IST

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి 2016 కలకాలం గుర్తుండి పోతుంది. ఈ ఏడాదిలో ఆమె నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ .. సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సో 2016 లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా రకుల్ పేరు సంపాదించుకుంది. ఈ రోజు విడుదలైన ధృవ చూసిన వారందరూ కథ, రామ్ చరణ్ తేజ్, అరవింద్ స్వామి నటనతో పాటు రకుల్ అందాల ఆరబోత గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆమెను ఆకాశానికి ఎత్తెయ్యగా, ఈ రోజు చెర్రీ భార్య ఉపాసన కూడా రకుల్ ని అభినందించింది. “పరేశానురా” పాటలో చేసిన స్కిన్ షో ఇంతకముందు ఏ చిత్రంలోనూ ఆమె చెయ్యలేదు.

ఈ పాటలో అంత హాట్ గా కనిపించడానికి కారణం ఏమిటని ఈ భామను ప్రశ్నించగా.. నవ్వుతూ సమాధానమిచ్చింది. ‘ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సిక్స్ ప్యాక్ బాడీతో చాలా హాట్‌గా కనిపిస్తాడు. కచ్చితంగా అందరి కళ్లూ అతనిపైనే ఉంటాయి. కాబట్టి ఆడియన్స్ ని నా వైపు తిప్పుకోవడానికి నేను ఎదో ఒకటి చేయాలిగా. అందుకే హాట్ కనిపించాను. అసభ్యంగా లేనంతవరకు గ్లామర్‌ విందు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’ అని రకుల్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా  హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు , యువ సామ్రాట్ నాగ చైతన్య సరసన కూడా నటిస్తోంది. అయితే వచ్చే ఏడాది కూడా హాట్ హాట్ గా హ్యాట్రిక్ కి సిద్ధమవుతోందన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus